సర్ ఆర్థర్ కాటన్
తేది 15-05-2024
శీర్షిక : కష్టం తెలిసిన కాపు ...
కర్కోటకులలో కరుణ కలిగిన మనిషిలా
రాక్షస లోకంలో రామ దూతలా
ప్రజల బాగోగులకై పరితపించిన
గాంధేయ వాది .
కరువు కాటకాలకు కరిగి పోయిన
మానవతావాది ...అనవరతం
అలోచించి... నీటి గమనానికి
వాటంగా ఆనకట్ట వేసిన ప్రతిభాశాలి ...
ఆంధ్రుల ఆర్ద్ర హృదయుడు
ఆత్మీయతల చిరునామా...
రైతే రాజని నమ్మి రైతన్నలకు
దన్నుగా నిలిచిన అపర భగీరథుడు ...
లక్షల ఎకరాలకు లక్షణంగా
నీరందించి ... కన్నీరు తుడిచి
కడగండ్లు బాపిన ధీశాలి .... ఉభయ
గోదావరుల రైతులకు ఉన్నతుడు ...
బీడు నేలలలో పాడిపంటలను
దర్శించిన ప్రజ్ఞాశీలి ... అన్నపూర్ణను
ఆవాహనం చేసి సస్య శ్యామలం
కానుక చేసిన కష్టం తెలిసిన కాపు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment