జనన మరణాలకు ఆవలి వైపు
తేది : 15-05-2024
శీర్షిక: రంగుల రాట్నం ....
కన్ను తెరిస్తే జననం
కన్ను మూస్తే మరణం ...
నడుమ జరిగే తతంగమే
రంగుల రాట్నపు జీవితం..
మహానుభావులు చెప్పినట్టు...
తినడానికి బ్రతకడం
బ్రతకడానికి తినడం
పశు పక్ష్యాదుల వలె
మాత్రమే కాకుండా ...
ప్రజ్ఞావంతుడైన మనిషి
సాధించాల్సిన మర్మం
ఇంకేదో ఉందన్నది నిజం ....
యుగం మారినా జగాన
తేజమై వర్ధిల్లిన పుణ్యాత్ముల్లా
చనిపోయినా బ్రతకగలిగే
మహత్తరమేదో సాధిస్తేనే
మనుషులు చిరంజీవులవుతారు .....
ప్రముఖ కవి కాళన్న అన్నట్టు
జననం నీది మరణం నీది...
కానీ
జీవితం ఈ సంఘానిది అన్నట్టు...
అవయవ దానాలతో సైతం
అధిరోహించవచ్చు ఆవలి తీరం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment