వాయు కాలుష్యం
తేది : 15-05-2024
శీర్షిక : అత్యవసరం ....
జీవరాశి అత్యవసరాలలో ఆది ప్రథమం
ప్రాణవాయువు... అయినా మానవ అలసత్వం
నివారణ చర్యలకు నీళ్లొదిలి... దిక్కులు చూస్తున్న
దీనస్థితి ...చేతులు కాలాక ఆకులు పట్టిన చందం...
పారిశ్రామిక ప్రగతి రథంలో... రవాణా సౌకర్యాల
రమ్యసుందరాలు ... వెరసి ఉద్గారాల విడుదల...
నెత్తి నోరు గగ్గోలు పెట్టినంత మాత్రాన
శుద్ధమైన గాలి పీల్చుకోగలుగుతామా ....
కారణాలేవైతేనేం ... అంతరింపజేస్తున్న
అడవులు...తరువులు ... తరిస్తున్న
వాయు కాలుష్యాలు...తందానా అంటున్న
రాజకీయం ..తప్పెట కొడుతున్న
అధికారగణం అమ్యామ్యాలు ...
వాగు చలిమలు తాగిన వైనం నాడు
తాగునీటికి మొహం వాచిన తీరు నేడు
అలసత్వాలు మూటగట్టి సెలయేళ్ళన్నీ
నింపగ నదీమతల్లుల నడ్డి విరిగింది ....
నేడు ధైర్యంగా ఏ నీరు తాగలేని
దైన్యస్థితి ఎక్కడ చూసినా ...
అనుభవాలు చాలవా అది చూసైనా
వాయువులపై శ్రద్ధ తీసుకోవాలి కదా ....
ప్రభుత్వ పథకాలెన్నైనా ... ప్రజా
సహకారం సున్నయితే ... పలితమెప్పుడు
నిష్ప్రయోజనమే... ఉమ్మడి ప్రయత్నమే
ఉన్నతాశయాల సాధనలో ఉడతాభక్తి. ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment