మమతల వనం
తేది : 13-05-2024
శీర్షిక: ప్రాణవాయువు…
పచ్చని పాడిపంటల పైరులాంటి
మమతల వనానికి పెట్టిపుట్టింది భారతవని ...
వసంతంలో చివురులేసే కొమ్మరెమ్మల్లా
వనమంతా విస్తరించి అల్లుకున్నది…
అమ్మకో దినం... ఆలికోదినం...అనకుండా...
సర్వకాల సర్వావస్థలయందు పరిఢవిల్లు ...
సతతహరితములా సంయమనమున
సత్కీర్తులు పొందుతూ మమతల వనమిచ్చోట…
అమ్మానాన్నల ఆత్మీయతలకు...
తోబుట్టువుల అనురాగాలకు...
బంధు మిత్రుల అనుబంధాలకు
కొదువలేదు హైందవమున….
అవనంతా పరుచుకున్న
పిండివెన్నెల్లాగా...జీవరాశంతకు
పరిచయమైనా...మానవాళిలో
పిసరంత మిన్న అనే చెప్పాలి …
చుట్టూర ఎవరున్నా లేకున్నా
సట్టులా మమతలవనం వెల్లివిరిస్తే సరి…
ఆకలి దప్పులు ఆద మరిచిపోయి
ప్రాణవాయువులతోనే పదిలపరుచుకో వచ్చు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment