Sunday, July 14, 2024

భ్రమలను తొలిగించుకుందాం తేది : 07-03-2024 శీర్షిక : "మనం " లోనే మాధవత్వం ...

  భ్రమలను తొలిగించుకుందాం

తేది : 07-03-2024
శీర్షిక : "మనం " లోనే మాధవత్వం ... 
సహస్రాధికం  

వేయి అడుగు ముందుకు 
వేల మైళ్ళ ప్రయాణమైనా 
వేసే ఒక్క అడుగుతోనే ఆరంభం ... 
వెనుదిరగకు ... వేల పాదాలు 
జతగూడుతాయి ...."మన"తోనే 
ప్రారంభం చేసుకుందాం ... 

పోరాడి శిఖరమై నిలిస్తే మాత్రం 
అంతా నీ వెంటే ....అదికూడా 
వాళ్ళ అవసరాలకే నీవేమైనా 
అక్కరకొస్తావనే ... ఆశ ... అత్యాశ ... 

ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని 
ఆశపడవద్దంటూ అనుభవాలు ... 
మంచిని నేస్తం చేసుకుంటే 
"మన"తోనే జనమంతా కాముక .... 

స్వార్థం సంచులకొద్దీ నింపుకుని 
టన్నులకొద్దీ అల్మారాలలో దాచుకునే 
రోజులివి ...ప్రాణమైన విడుస్తారేమో 
కానీ "నా " అనే పదాన్ని మాత్రం విడువరు .... 

"మనం"  అనుకుంటే మాధవులమే ... 
ప్రకృతి ప్రత్యక్షంగా నేర్పినా రాదు ... 
పశుపక్ష్యాదులు పాటించిన ఈపూట 
మనం పాటించం ... తరాలకు 
సరిపడా దాచడానికి తండ్లాడుతాం ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment