ఆత్మవిశ్వాసాన్ని శ్వాసిద్దాం
తేది : 15-02-2024
శీర్షిక : చేయందిద్దాం ....
అనుభవాల పాఠాలెన్నో రుజువులే
జీవరాశిలో మానవాళి ఎపుడూ మిన్నని ...
కానీ చిక్కంతా ఇక్కడే మనుషుల మధ్య
పరిస్థితుల పందేరంలో కొట్టుమిట్టాడుతూ ...
చర్యకు ప్రతిచర్య సిద్ధాంతములా
దేశాలమధ్య కూడా దేబిరిస్తున్నది ...
సంబంధమే లేని బాంధవ్యములా
సడేమియాలా కొట్లాడుతున్నది ....
కోపం లేకుండా కొట్టిన దెబ్బలా
పడమటి మూలన నక్కిన కొందరు
ప్రపంచ దేశాల ఆర్దిక మూలలను శాశిస్తూ ...
పట్టుకుని లేపాలన్నా ... పడదోయాలన్నా ...
అన్నీ గమనించి ఆకళింపు చేసుకుని
సగర్వంగా గర్జించాడు బెబ్బులిలా ...
ఆత్మవిశ్వాసాన్ని శ్వాసిద్దామని పిలుపునిచ్చి
అచ్చెరువుగా రూఢిపరిచాడు విశ్వాన్ని ....
స్వతహాగా మనకంటూ లేకున్నా
సంబరంగా చేయందిద్దాం చేతనైనవిధంగా ...
సమతా మమతలు చాటుతూ
మానవత్వానికి మించిన మంచిలా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment