భారతరత్నం పీవీ
శీర్షిక : భారతావని ముద్దుబిడ్డ
తేది 10-02-2024
మృదు భాషి ....ముచ్చట గొలిపే
ఆహార్యం... ప్రథమ భూసంస్కరణల
సామాజికవేత్త...నవోదయ పాఠశాలల
అంకురకర్త ...తెలుగువారి ఆత్మగౌరవం ....
ఇంటగెలువక రచ్చ గెలిచిన
ఇగురుశాలి... కంటకాలెన్నున్నా
కాలపరిధి నిండా పరిపాలించిన
విదుర నీతుల విలక్షణ భావశీలి ....
17 భాషలలో పండితుడు
ఇన్సైడర్ లో ఇమడని పాత్ర ...
వేయి పడగలను సహస్రఫన్
గా అనువదించిన ఘనుడు ....
వర్గం లేని వంగర వాసి
స్వర్గతుల్య పాలనలందించె…
అపర చరకుడై చికిత్స చేసాడు
ఆర్థికరంగ ఋగ్మతకు భారతాన….
స్వర్గతుల్య పాలనలందించె…
అపర చరకుడై చికిత్స చేసాడు
ఆర్థికరంగ ఋగ్మతకు భారతాన….
ఎనబదులలోనే సాంకేతికతను పొదువుకుని…
సంఘ భవిష్యత్తును గుర్తించిన భావి మార్గదర్శి….
ఎగుమతులకు కూడా అవకాశాలు
మెండని గుర్తెరిగిన గుణశీలుడు …
పదుగురి క్షేమమే పరమావధిగా
భూరి విరాళంగా తన భూములనే
తొలుత ఉద్యమానికిచ్చిన ఉదారవాది…
పట్టనట్టు పార్టీలు వ్యవహరించినా....
ప్రజల మనిషిగా నిలిచి గెలిచిన
ప్రధానమంత్రి మన తెలుగు తేజానికి
ప్రధానమంత్రి మన తెలుగు తేజానికి
ఎట్టకేలకు ఎదుటివారు గుర్తించి
కట్టబెట్టిరి కలికి తురాయి భారత రత్నగా ....
ఎత్తైన శిఖరంపై ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment