Wednesday, July 3, 2024

పడమటి గాలుల పనితనం తేది : 13-02-2024 శీర్షిక : వివేకంతో మెలగాలి ...

 పడమటి గాలుల పనితనం

తేది : 13-02-2024
శీర్షిక : వివేకంతో మెలగాలి ... 

నాణానికి రెండు వైపులలా 
మంచి చెడుల మిళితమే ... 
విచక్షణలతో చేయగలిగిన 
విందుభోజనం రుచులులా…

నైరుతి గాలుల నయాగారమె   
రుతుపవనాల తొలకరి .... 
హాలికుల మోమున విరిసే 
హరివిల్లు జల్లుల పలువరస .... 

అవనికి పచ్చపూవందములద్ది 
అరవిరిసిన అందాల సొగసులతో 
పడుచు ముత్తైదువగ తీర్చి దిద్ది 
సోయగాలను పంచుతూ ఆనందాలను 
పంచేది.... 

అవే నైరుతి గాలులు ఇంట 
జొచ్చిన... పైకప్పును కూల్చి 
పరమ భయంకరములైన చేదు 
అనుభవాలను మూటగట్టు .... 

పశ్చిమ పోకడల పలు విధానాలు 
వివిదాంశములే...ఏమి ఒరగబెట్టని 
నూతన సంవత్సరమైనా ... ఎందుకు 
అక్కరకు రాని ఒక్కరోజు మొక్కుబడులైనా ... 

అమ్మ దినమని ... ఆలి దినమని ... 
నాన్న దినమని ... కౌగిలింతల దినమని 
పిండాలు బెట్టే పితలాటకములే .... 
యువతను పెడదారి పట్టించే అనేక 
దినోత్సవాలు .... అందుకే .... 

విశాల ప్రపంచపు వింత పోకడలను 
కొంత గమనిస్తూ ...విజ్ఞులమై ఎప్పటికప్పుడు 
వివేకములతో మెలగడమే....సంస్కారం… 
సంస్కృతి ధర్మం కోసం దాపుగా నిలవడమే .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment