కవన రవళి
14-04-24
నానీలు "వంచన"
కలి ధర్మము
మూడు పాదములంటే
వంచన కూడా ...
కుక్కను చూపి
మందిని కొట్టడమే
రాజకీయము ...
మీరేం తెస్తారు
మాకేం తీసుకొస్తారు
స్వార్థం కొండంత ....
వంచనోళ్లకు
మన పర బేధంలే
నమ్మిన చోటే ....
కొన్ని చిట్ ఫండ్ లు
వంచనకు కెరాఫు
చిరునామాలు
పట్నంలో చాలా
పల్లెలలో కొంతనే
వంచన సూచీ
నగునూరి రాజన్న
No comments:
Post a Comment