నెట్టు లేనట్టయితే
అంశం: 07-02-24
శీర్షిక: జుట్టు పీక్కునుడే…
రాతిగుహల జీవితం
నాగరికతలో నడకలు నేర్చి
పారిశ్రామికతలో పరుగుపెడితే
సాంకేతికతలతో సాలెగూడయ్యింది…
ఆన్లైన్లలో ఆర్డర్లు వేస్తే పసందైన
కొనుగోళ్ళు..కరోనా కాలమహిమలు
క్లాసురూమును కళ్ళముందు కట్టేసింది…
యువతల భవితలన్ని నెట్టింట్లో
లంగరేసినవి…భవిష్య పురాణాలను
భధ్రపరిచి చిలుక జోస్యాల చిత్తరువులకు
రూపం కల్పించి రంగు రుచులను
పంచుతున్నది…
అంతర్జాలంలో మంత్రమేయగలగడం
ఆధునికతలో సాధించిన తంత్రం…
ఇంటినుండే ఇనుమడిస్తున్న
ఉత్పాదకతల ఊపు కూడా సాక్ష్యం…
చందమామ రావే అంటూ పిల్లలకు
గోరుముద్దలు తినిపించినా…బడిలో
పాఠాలకు బంగారు దారి చూపినా…
యువతకు ఉద్యోగ మార్గదర్శకమైనా…
అన్నింటా ఆరితేరిన ధీశాలి. …
నాణానికి రెండువైపులలా మంచితో
బాటు… పెడ దారికి కూడా ద్వారాలు
తెరుచుకుని మరకలు నిండిన మచ్చలతో
అక్కడక్కడా యువతకు నిర్వీర్యతల
నిగారింపులు కూడా…
అడుగడుగున అపేక్షలు కుమ్మరించినా…
విజ్ఞాన విచక్షణలతో అడుగులేస్తూ….
జీవరాశిలో భావరాశి నిండిన
వివేకవంతులమని నిరూపణలకు
నిరుపమానమై మెలగాలి….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment