Thursday, July 25, 2024

చిత్రకవిత తేది : 12-05-2024 శీర్షిక : పునశ్చరణే పుణ్యధామం....

 చిత్రకవిత 

తేది : 12-05-2024 
శీర్షిక : పునశ్చరణే పుణ్యధామం.... 

పదమెలా వచ్చిందో 
తెలియదు నాకూ .... 
ముదముగొలుపు అమ్మ పదము 
మురిపాలను తీర్చంగా... 

పదమెక్కడిదో 
తెలియదు గాని 
ఆనందమే అమ్మ పలుకు  
తనివి తీర పలుకంగా .... 

సురలోకపు 
సుందరమేమో 
అమ్మ యను పదములోన  
అమృతము పొదువుకొనగా....  

ఓంకారమే అమ్మ పదము 
అవనిలోన ఎవరికైనా .... 
మనసంతా పులకరించు 
అమ్మా అను నాదంతో... 

ఏదేమైనను  గాని 
మరువకు స్మరణం జీవితాన 
అమ్మ అను జపమును .... 
పునశ్చరణే పుణ్యధామం.... 
 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment