వ్యాపారం
తేది :11-05=2-24
శీర్షిక : మచ్చుకైనా లేక… స్వచ్చమైన వాణిజ్యం
మచ్చుకైనా కానరాక ...
కలిధర్మం ఒంటికాలిపై నిలవలేక
కల్తీలతో అలరారుచున్నది ...
కల్తీల కండలు కాలరెగరేసుకుంటుంటే
కాలుష్యాలు విర్రవీగి కబాడి ఆడేస్తుంటే
విషనాగులై వీర విహారం చేస్తుంటే
అనారోగ్యాల కార్చిచ్చులు దావానలమై వ్యాపిస్తుంటే...
వైద్యం బస్తీమే సవాలంటూ కుస్తీలకు దిగుతుంటే...
ప్రజారోగ్యాలన్నీ అప్పనంగా కుప్ప కూలుతూంటే ......
విద్య వినయ విధేయతల దారి మార్చుకుంటుంటే...
ప్రజాసంక్షేమం పతనదారుల పయనిస్తున్నది…
వణిక్ ల చెంత వ్యాపారమున్నపుడు
వాణిజ్యం నీతి నియమాలతో సాగినది ...
కల్తీలకు తావు లేకుండా కాలుష్యాలకు
దూరంగా ... గుప్తుల కాలం స్వర్ణయుగమని
సమున్నతమై కీర్తించబడినది....
అందుగలడు ఇందులేడన్నట్టు...
కంత్రీ కార్పొరేట్ ప్రవేశంతో
వ్యాపార నీతులకు తిలోదకాలతో
అత్యవసరాలు ... అవసరాలు
విలాసాలన్నీ వింతలతో నిండింది ...
అత్యవసర ఔషధాలతో కూడా
అంతులేని వ్యాపారం చేస్తూ
నకిలీలే అసలులా భ్రమింపచేస్తూ
మానవత్వం మరిచి రాక్షసత్వంతో
జెలగల్లా రక్తం పీలుస్తున్నారు....
ఇక అవసరాల విషయానికొస్తే
పండ్లు పాలను కల్తీలతో ముంచేస్తూ
తిండి తిప్పల్లను కూడా కల్తీ చేస్తూ…
వంట సామాన్లు వస్త్ర ప్రపంచం ...
ఒకటి కొంటె ఒకటి ఫ్రీ అంటూ
అక్కరలేని కొనుగోళ్లు చేయిస్తూ ....
మధ్యతరగతిని పేదవాన్ని చేయ
కంకణం కట్టుకున్నది ...
అసలు బంగారాన్ని కల్తీ చేస్తూ
తిమ్మిని బిమ్మి చేస్తూ ... తరుగు
లేదంటూ ... కూలి లేదంటూ...
నకిలీ రాళ్లను వజ్రాలుగా చూపిస్తూ
కుదేలు చేస్తున్నారు వనితల
బంగారు ప్రపంచం ...
నియంత్రణలకు నీళ్లొదిలి
యంత్రాంగాలను గాలికొదిలి
గమ్మత్తులను పరిశీలిస్తుంది
ప్రభుత్వ శాఖల పనితీరు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment