Thursday, July 25, 2024

ఆకాశమంత మనసు తేది: 12-04-24 శీర్షిక: అనంతం…

 ఆకాశమంత మనసు 

తేది: 12-04-24
శీర్షిక: అనంతం… 
సహస్రాధికం … 

అందరు నావారనుకునే ఆత్మీయత 
అంతా మంచనుకునే భరోసా …
నాకేమిస్తావవనే స్వార్థముండక
సదా తానేమివ్వాలనే తపనలే ... 

అక్కున చేర్చుకుంటే అనంతమే 
మనసు పరవశాల నక్షత్రాలే ..
మననంతోనే మహోత్సవం..అందరు
బాగుండి అందులో తానుండడం …

నమ్ముకున్నోల్లకు నమ్ముకున్నంత
కొండంత అండలో కోనేటి రాయుడు…
ఎదుటోళ్ళ కష్టానికి ఎగపోసే కన్నీరు 
దమ్ముచూపి దుమ్మురేపే రకం … 

 నడుంబిగించడమంటే సాయమే 
 మడమతిప్పని మహదానందం… 
ఎక్కడ సరిగ్గా తగ్గాలో తెలిసి 
అంతటా తానే నెగ్గే మనస్తత్వం… 

మనిషి పోయినా మరక మంచిదేలా
మరువనీయని మనస్తత్వం ... 
 ఆకాశమంత మాత్రమే కాదు 
 అనంతమని నిరూపణలే ...


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment