Thursday, July 25, 2024

వింత పోకడల వివాహ తంతులు 12-04-2024

 వింత పోకడల వివాహ తంతులు


 మాటముచ్చట మతలబులు 
 అయిపోగానే ఆరాటాలు... 
 అంచనాల తలమునకలు 
 ఆటపాటల గెంతు ముచ్చట్లకు..

ప్రేవెడ్ షూటింగులని 
 పొలం గట్లల్లో పర్యటనలు .. 
 పెళ్లికాకుండానే తుళ్ళిపడే 
 ఛాయాచిత్రాల గమ్మత్తులు ... 

 ఫార్మ్ హౌసుల చిరునామాలు 
 రిసార్టుల విచారణ రీసెర్చులు... 
సంగీత్ పేరుతో సరదాల సందళ్ళకు 
 సందర్బోచిత తంతు ప్రళికాలు ... 

రంగు రంగుల కాంతులీనుతూ
 విరజిమ్మే విద్యుల్లతలు ... 
 నాట్య సౌకర్యము నగారాకు
 అక్షరలక్షల లక్షణ వేదికలు ... 

అంబరమంటే అలంకరణలు
మురిపములిచ్చే ముద్దు గోరింటలు 
 హల్దీ పేరుతో అచ్చమైన పసుపు 
 పచ్చ వస్త్రములు ... ఛాయా చిత్రముల 
 చతురంగ బలములు .....

వేరు వేరుగా వేల చిత్రాలు 
అలుపులు తీర్చే తింగరి నాట్యాలు 
 మధ్యాహ్న భోజనాల తదుపరి 
 మంగళ స్నానాలు మాపటివేళ ...

పసిడి ఆభరణాల కొనుగోళ్లు 
పట్టువస్త్రాలు పెట్టుబడులు 
 ముట్టుకుంటే కందిపోయే 
 మురిపమైన అలంకార సామాగ్రి... 

పట్టెడు మెతుకుల భోజనాలకు 
 పలురకాల తీపి పదార్థాలు ... 
 మరెన్నో రకాల చాట్ బండారాలు 
 ఇడ్లి దోశలు వడ పెసరట్లు కాకుండా.. 






నగునూరి రాజన్న

No comments:

Post a Comment