Thursday, July 25, 2024

అతడే ఆమెలో సగం తేది: 03-05-2024 శీర్షిక: ఒకరికొకరన్నది వాస్తవం…

 అతడే ఆమెలో సగం 

తేది: 03-05-2024
శీర్షిక: ఒకరికొకరన్నది వాస్తవం… 

ఆదిదంపతులైన అపూర్వం
శివపార్వతులే శిరోధార్యం... 
అతడే ఆమెలో సగమని 
అనిర్వచనీయమైన ఉదాహరణ... 

 పుష్కలమైన పురాణాలు 
 ఇంపైన ఇతిహాస గ్రంథాలు
 కాలానుగుణ కావ్యాలు 
 లెక్కలేనన్ని బోధనలు హైందవంలో.. 

యుగం మారినా జగం మరువని
ఉద్గ్రంధం రసరమ్య రామాయణం... 
 సీతా రాముల జీవితమే ఘన 
 ఉదాహరణం.. ఒకే భార్యంటూ 
 ఒలికించిన ప్రేమమయం త్యాగమయం...

పేరులోనే ఆమె పేరు ముందు 
ఆ తదుపరే ఆయన పేరుంచి
అపుడెపుడో నిర్వచించె గద దంపతులను
అతడే ఆమెలో సగమని రూఢీగా... 

అమ్మగా ప్రాణాలను ఫణంగా పెట్టినా..
ఆలిగా తనువంతా సమర్పించినా…
చెల్లిగా కూతురిగా అనురాగాలు పంచుతూనే… 
అయినా కలిలో తన ఉనికికై తప్పని పోరాటం…

ఏదేమైనా భార్యా భర్తలు
ఒకరికొకరన్నది సహజ వాస్తవం… 
ఎవరొకరు లేకున్నా ఎరుకపడని
అసంపూర్ణ కావ్యమే .... 



నగునూరి రాజన్న 

No comments:

Post a Comment