Thursday, July 25, 2024

కనుపాపలోని కరుణ తేది : 02-05-2024 శీర్షిక : అసలైన పరీక్ష ...

 కనుపాపలోని కరుణ

తేది : 02-05-2024 
శీర్షిక : అసలైన పరీక్ష ... 

కడుపులో లేనిది కౌగిలించుకుంటే 
వస్తుందా అన్నట్టు ... స్పందించే 
మనసు లేనప్పుడు... కళ్ళల్లో 
తెచ్చి పెట్టుకుంటే కరుణ వస్తుందా ... 

ఇంటి లక్షణం పందిరి చెప్పినట్టు 
మనిషి తత్వమంతా... ప్రస్ఫుటించే 
మొహ కవలికలలో ... కళ్ళలోని 
కాంతిరేఖలతో కనిపెట్టవచ్చు .... 
లోపలి భావాల లొసుగు పిట్టను... 

స్వార్థమెరుగని సంగీత విభావరిలా  
సదా పరుల మేలు ఆనందం కోరే 
సమున్నత భావ సంపదలా .... 
కథ వినిపిస్తే... కలవరపడి వర్షించే కళ్ళు.... 
అచ్చమైన కనుపాపలోని కరుణ 
అక్కడక్కడ మాత్రమే అందుబాటు  సుమా ... 

స్వదేశం వదిలి ... పరదేశంలో 
కరుణ వెలగబెడుతున్నానంటూ 
కొంతమంది కోతల రాయుళ్లు 
టముకువేసి డప్పులతో గొప్పలు 
చెప్పుకునే గోత్రీకులు కూడా ఉంటారు .... 

తస్మాత్ ! జాగ్రత్త చాపకింద నీటిలో 
విషయమే లేకున్నా ... ఏం విషముందో 
ఎరుకతో మసలుకోవడమే ...మనలాంటి 
మనుషులకు అసలు సిసలైన పరీక్ష ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment