పుస్తక ప్రచురణ-కష్టాలు
తేది : 10-05-24
శీర్షిక: సంకల్పమే విజయం ....
కల్పనలు చరిత్రలు కథలుగా
కథానికలుగా... రక్తి కట్టించే నాటికలు
నాటకాలుగా.. భక్తి కావ్యాలు ప్రబంధాలు
మినీ కవిత్వ రూపాలుగా ద్విపదలు త్రిపదలు
నానీలు శ్రీపదాలు హైకూలు
కైతికాలు ... టుమ్రీలు హరివిల్లు
మొగ్గలు... ఛందోబద్ధమైన పద్య కవితలు
కట్టుబాట్లు లేని వచన కవిత గేయ కవిత
రాగమెత్తి రంజించే బుర్రకథ... సమయమెక్కువ
తీసుకోని మినీ కవితలు... ఆరొగ్యవంతమైన
విమర్శలు సమీక్షలు... విపులీకరించే కరపత్రం
వాస్తవాలు ముందుంచే వ్యాసాలు.. ఎవరికీ వారే
యమునా తీరేలాగా ముక్తకాలు... ఖండకావ్యం
పద్యాలు మకుటంతో శోభించే శతకాలు ....
ఏవైనా కావొచ్చు ... ఎన్నైనా కావొచ్చు
రాస్తుంటే ... చదువుతుంటే ... రాటు
దేలి పోవచ్చు ... రమ్యంగా రాయొచ్చు ...
కాళన్న చెప్పినట్టు కవి జీవితం మాత్రం
సంఘానికే ఉపయోగించాలి ....
సాంకేతికత పెరిగినదని
సంధికాల పరిస్థితులని
సమృద్ధిగా పెరిగె కదా సంఖ్య
సకారాత్మక కవులలోన ....
స్వంతంగానో ... సామూహికంగానో ...
స్పాన్సర్స్ సహకారంతోనే ... అచ్చులోకి
తెస్తేనే ... పదికాలాలు పదిలమౌతాయి
పది మందికి చేరుతుంది విజ్ఞానం ....
పేరు ప్రఖ్యాతులొస్తే ... వద్దన్నా
స్పాన్సర్స్ ...
సముద్రమంత రాసినా
త్రాగునీరు లాంటి నదీజలాన్ని
గుర్తించి చిత్తుప్రతిని తయారు
చేసుకుని ...వెదికి వెదికి అక్షర దోషాలను
వెలికి తీయాలి . అవసరమైతే
అనుభవజ్ఞులచే సరిదిద్దించుకుని ...
మంచి ప్రతులు రెండుమూడు చేయాలి...
సాహిత్యంలో తలపండిన పెద్దవారికి
పంపించి ముందు మాట ఏరి కోరి
వ్రాయించి మురిసిపోవాల్సిందే...
కొత్త వారికైతే బొత్తిగా తెలియదు ...
అందులో కూడా అనుభవజ్ఞుల
సాయం అందిపుచ్చుకోవాల్సిందే ....
కవరు పేజీ డిజైనింగ్ కు కూడా కాసింత
ఊహల పందిరి ఊపిరి పోసి డిటిపి అతనికి
అందిస్తే ... గూగులమ్మ చెంత నుండి
ఛేదించనిదేముంది సాధించనిదేముంది ....
అన్నీ సమకూరగానే ... అందులోనే
ధన్యవాదాలు తెలుపుతూ ఆఖరున మన
మాటను జోడించి ... రచయిత పుట్టు
పూర్వోత్తరాలు చివరన పొందుపరిచి
ముఖ్యమైన ఘట్టాలను మురిపంగా
చూసుకొనుటకు కవరు పేజీ లోపలి
భాగాలను వేదిక చేసుకోవాలి.
సాహిత్య వేదిక సమరాంగనమున
ఆహ్వానములను ఫ్లెక్షీలను పేరెన్నికగా
చేయించి ... అనువైన వేదికను
అలంకరించుకుని ... ముఖ్య అతిథులను
శ్రేయోభిలాషులను సాదరంగా ఆహ్వానించు
గ్రంథావిష్కరమునకు సగర్వమై ....
పుస్తకాన్ని పరిచయించే వక్తకు ...
ముఖ్య అతిథులకు ముందుగానే
ప్రతులందివ్వగలిగితే ... మురిపమైన
ఆవిష్కరణ ముద్దు ముచ్చటగా తీరుతుంది ....
ఎవరెవరు దేనికో ఎరుకపరుచుకోవాలంటే
ఆవిష్కరణ సభలెన్నో అందుబాటుగా
హాజరవ్వాలి ... ఏదేమైనా అనుభవమే
అతిపెద్ద పాఠం ..... సంకల్పమే విజయం ...
పేరున్న ప్రింటింగ్ వారితో పేచీలు
లేకుండా ప్రచురణలు చేయిచుకోవచ్చు ..
ఉదా .. కర్షక్ ప్రింటర్స్ రాంనగర్
హైదరాబాద్.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment