కవన రవళి
08-05-24
హైకూలు
1.పచ్చనోట్లలో
ప్రజాస్వామ్యం విలువ
పదిలమాయె… (నేడు)
2.ఓట్ల విలువ
ఐదేండ్లకొకసారి
పెట్టెల్లో భద్రం…
3. విలువ లేని
వింత రంగు కండువ
పాలిస్తున్నది.
4. కలియుగంలో
కరెన్సీల కట్టలే
ఎన్నికలాయె…
5. ప్రజాస్వామ్యము
పనితీరుకు అద్దం
పడుతున్నది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment