Thursday, July 25, 2024

అహంభావాల ద్వారాలు తెరిచి… తేది : 10-05-2024 శీర్షిక : తేనెపట్టులా ఆత్మీయతలే ...

 అహంభావాల ద్వారాలు తెరిచి…

తేది : 10-05-2024
శీర్షిక : తేనెపట్టులా ఆత్మీయతలే ... 

అరుదుగా  వచ్చిపోయే చుట్టమైతే 
ఆందోళన పడాల్సిన పనేమి లేదు .... 
ప్రతిరోజు పక్కనుండే మితృడిలా అహం 
అంటిపెట్టుకుంటేనే అసలు సమస్య ... 

ఆత్మసాక్షిని అలక్ష్యం చేస్తూనే 
చెప్పే మాట వినడానికి మొహమాటం ... 
అందరికి నేను చెప్పింది వేదమవ్వాలి ... 
వినకపోతే వింతరీతులే మరి  .... 

పారంపర్యమై వరించిన బహుమతో  
తినుబండారాల తిప్పల్లతోనో  లేదా .... 
డాబుదర్పాల ప్రతిబింబపు  ఫలితమో 
సంయమనశీలతలు ఒంట బట్టవు .... 

ఎక్కడ తగ్గాలో తెలిస్తే 
ఎక్కడైనా నెగ్గవచ్చు ... 
అహంభావం ఆసరా చేసుకుంటే 
ఈనాటి రాజకీయపార్టీల లాగ 
పతనానికి దారి వేసుకున్నట్టే...

ప్రజాక్షేమాలకంటే ఫలహారం 
మేయడమే అతి పెద్ద పనిగా 
నిర్ణయించుకున్నాక.. పార్టీలకు 
పతనం చాలా సులువైన మార్గమైనది  .. 

తలుపు కొట్టి అహం పలకరిస్తుందేమో 
తనదే పై చేయవ్వాలని తపనలు  .... 
గుర్తింపుకు గుత్తాధికారం తీసుకున్నట్టు 
అలకల పాన్పులను పలకరిస్తుంటారు .... 

అహంబద్దలు కొట్టి ద్వారాలు తెరుచుకుంటే 
అసలైన తేనెపట్టుల ఆత్మీయ మాధుర్యం 
రసపట్టులాంటి అనురాగ పాల కంకుల 
పలకరింపులు చిలకరింపులతో ఉక్కిరిబిక్కిరే ...  
అహానికి అర్ఘ్యం వదిలితే అన్నీ సాధించవచ్చు 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment