Saturday, July 13, 2024

చిత్ర కవిత తేది : 10-03-2024 శీర్షిక : తల్లి ప్రేమ

 చిత్ర కవిత 

తేది : 10-03-2024
శీర్షిక : తల్లి ప్రేమ 

ఒకప్పుడు వెలుగు పంచి 
వేలు పట్టుకుని నడిపించి 
మానవాళి జీవితాలకు 
మార్గదర్శనమైన హరికేను ... 

తుప్పుపట్టిన  తుచ్చ దశలో 
కూడా నోరులేని పిట్టలకు 
గూడై ...నేనింకా ఓడిపోలేదని  
రుజువు చేసుకున్న తీరు అమోఘం ... 

గుహల్లో బతికిన రాతి యుగం 
మనుషుల జాతిలా  ... చెట్టు 
చేమల్లేకుండా కాంక్రీట్ నయా 
జంగళ్ళలో బతికేస్తున్న తీరుకు 
అద్దం పట్టిన హృదయ విదారక 
దృశ్యం .... 

బుజ్జి బుజ్జి కూనలకు బువ్వ 
తెచ్చి కడుపు నింపుతున్న 
తల్లి పక్షి ... పరికిస్తే  ప్రేమ సందేశం 
పోలికేదీ మానవాళిలో .... 

ట్యాబో ఫోనో  తోడు లేకుండా 
తినలేని నవతరం పిల్లలకు .... 
ప్రేమగా బుక్కెడన్నం తినిపించ 
లేని ఎంతో మంది ఆధునిక 
తల్లులకు చెంప పెట్టులా ఉంది..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment