ఆరాధన ... అభిషేకం
తేది : 02-08-2022
శీర్షిక : ఆధ్యాత్మికత చిరునామాలు
కవిత సంఖ్య : 951
యుగాలు గడిచినా జగాన
తేజమే రామ చరితం ....
అమ్మ మాటకు ఆరాటపడినా ...
నాన్న గౌరవానికి వన్నె తెచ్చినా ...
తోబుట్టువుల పైన తొలకరిలా
అనురాగాలు చిలకరించినా ...
సహధర్మచారిని పట్ల ధర్మం
దశదిశలా వ్యాపింప చేసినా ...
శ్రీరామచంద్రమూర్తిగా….
ద్వాపరములో ధర్మరక్షణలకై
ధనుర్ధారికి ఉపదేశములు ....
గీత ప్రవచించిన ఆచార్యుడు
కుచేలునితో మిత్రుత్వానికే
కొండంత నిర్వచనం...కొంటె కృష్ణుడు
పరంధాముడే పరితపించి
మనిషిగా జన్మించె అవనిపై...
అష్టకష్టాలు పడినా ... చెదరని
మనస్తత్వమే కదా నేటికి ప్రతివారి
మనసు దోచుకున్న ఆరాధనత్వం ....
సృష్టి స్థితులకు బ్రహ్మ విష్ణువులైతే
లయకారకుడు కాశీ విశ్వేశ్వరుడు ....
జ్యోతిర్లింగరూపుడు హిమనివాసుడు
లింగరూపుడు చెంబెడు నీళ్లకే
సంబరపడిపోయి కోరిన కోర్కెలు తీర్చే
బోళాశంకరుడు రాజరాజేశ్వరుడు ....
మనసు కుసుమాలతో ఆరాధించినా ….
ఎంగిలెరుగని నారికేళజలములతోనో
ఔషధ బాండాగారాల పంచామృతాలతోనో
మర్మ సంచిత గంగాజలముతోనో అభిషేకించినా….
ఆధ్యాత్మికతలకు ఎల్లలెరుగని చిరునామాలే .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment