ప్రేమ గీతాలు
తేది : 10-02-24
శీర్షిక : చెలీ.... ! ఓ నా చెలీ
చెలీ.... ! ఓ నా చెలీ
చేరవే మరీ.... నా చెంతకు .....
రెప్పలు వాల్చినా
తిప్పలే రాకుండా ....
కనుపాపవు ఐపోవే
కలకాలం నిలిచిపోవ ...
శోధనలు లేకుండా
సాధనకు రూపమై....
రుధిరమై సాగవే
నా గుండె గుడి చేర ....
చెలీ.... ! ఓ నా చెలీ
చేరవే మరీ.... నా చెంతకు .....
తెలుపు నలుపులో
సప్తవర్ణ శోభితములో ....
నిక్షిప్తం అయిపోవే
నీడలా వెన్నంటి నా మదిలో .....
నామ జపములో
సాగే నక్షత్రపు పూజలో
నిత్య ఆరాధనలకు
నిజ అనుమతులీయవే ....
చెలీ.... ! ఓ నా చెలీ
చేరవే మరీ.... నా చెంతకు .....
మననమే మధురిమలై
మనమున నృత్యములే ....
తొలిప్రేమల గురుతులు
శతములైన మురిపములే ....
కలతనిద్ర పరిచయించి
కమ్మదనం నింపుతుంది ....
ప్రేమ పయనం ఇదేగా
జీవనగమనపు అడుగులు ....
చెలీ.... ! ఓ నా చెలీ
చేరవే మరీ.... నా చెంతకు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment