భక్తి గేయము
తేది : 09-03-2024
శీర్షిక : భారతీ గైకొనుమా హారతి
భారతీ గైకొనుమా హారతి
భారతీ గైకొనుమా హారతి
భాసురమై నిలిచితివే బాసరలోనా
భారతీ గైకొనుమా హారతి
పరాశక్తి బుద్ది ధాత్రి జ్ఞానప్రదాత
వరదాయిని భువనేశ్వరి శారదాంబ
విద్యలకు అధిపతివే వీణాపాణి
విరించి నాలుకపై నిలిచిన ఓ మాతా
//భారతీ//
మాహామాయ జ్యోతిర్మయి కౌమారీ
సౌదామిని వాగీశ్వరి హంసవాహిని
సర్వ శాస్త్రాలకు మూలము నీవే కావ్యా
విశ్వ విఖ్యాతం నొందిన ఓ మాతా
//భారతీ //
మహాశ్వేత మాలిని గీర్వాణి
చంద్రవదన బ్రాహ్మాణీ బిల్వానీ
సకల కళలకు సంకేతము ఓ మేధా
మానవాళికి నీవే మార్గదర్శం కావా ....
భారతీ గైకొనుమా హారతి
భారతీ గైకొనుమా హారతి
భాసురమై నిలిచితివే బాసరలోనా
భారతీ గైకొనుమా హారతి //2//
నగునూరి రాజన్న
No comments:
Post a Comment