Thursday, July 25, 2024

కవన రవళి 02-04-24 నానీలు నీటి ఎద్దడి…

 కవన రవళి 02-04-24 

నానీలు 
 నీటి ఎద్దడి… 

 పడతుల నెత్తిపై 
 కడువల బతుకమ్మ… 
 పాలకుల తలకు 
 రోకటిపోటు…

చాదస్తమని 
కొట్టేయకు… 
 సదా పాటించు 
నీటి పొదుపు 

 మాటలతో 
పొదుపుకు పాదు కాదు 
కరమందించు 
బొట్టుగా పట్టుకుందుకు…

 కుళాయి దగ్గర 
కొట్లాటలు 
లడాయిగా 
 సినిమా టైటిల్… 

 పంపును పట్టుకో 
రెండుచేతులా.. 
 పొదుపుకదే 
 మూల మంత్రము…


నగునూరి రాజన్న

No comments:

Post a Comment