యుగళ గీతం
తేది 02-12-2023
శీర్షిక : చెలీ……ఓ నా చెలీ ……
అతడు
చెలీ……. ఓ నా చెలీ ……….చెంత చేరవే నా మనసెరిగి
కొంతైనా తీరు నా ఆశల సిరి
ఆమె
సఖా…….ఓ నా సఖా …..
చేరేది నీ చెంతకే ఎపుడైనా
తలిచేది నీ తోడే ఏనాడైనా…
ఆమె
తాపములను తీర్చేసి
తనువంతా ఆవరించె…
మలయమారుతమై పోనీ
నీ చల్లని చూపులతో …
నిలువెల్లా తడిపేసే
మంచిముత్యపు సలిలములా…
హిమనదపు జలసిరివైపో
నీ కర స్పర్శలతో …
అతడు
తనువంతా కాంతులతో
నీరజముల మెరుపులలా….
పున్నమి వెలుగు పూవై
ప్రకాశించనీ నీ మోమును …
తనువంతా ఊయలై…
ఇంద్రధనస్సు భంగిమలా…
అంబుదమై వర్షించనీ
ఆ చల్లని ప్రేమలను …
బందీనై బాహువులలో
ఒదగనీ లేడిలా నను….
కరిగనీ కమ్మని సువాసనగా
వెచ్చని శ్వాసల వెన్నపూసనై…
మరుమల్లెల పరిమళాలు
సరిసమముగ నింపుకుని
మంద్రహాసపు క్రీనీడల
మధురసములను గ్రోలనీ….
అతడు.
మననముల తోటలలో
మైమరచి విహరిద్దాము…
మాటలతో ఉపశమనము
మనువు నిర్ణయించువరకు…
సన్నద్దపు మూటలతో
ఉద్దరించు ఫలితములకు….
మనమనసు తెలుసుకుని
పెద్దలమనసు కరుగుటకు….
అతడు
చెలీ……. ఓ నా చెలీ ……….చెంత చేరవే నా మనసెరిగి
కొంతైనా తీరు నా ఆశల సిరి
ఆమె
సఖా…….ఓ నా సఖా …..
చేరేది నీ చెంతకే ఎపుడైనా
తలిచేది నీ తోడే ఏనాడైనా…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment