Thursday, July 25, 2024

ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు తేది: 08-05-2024 శీర్షిక : దారి తప్పుతున్న నీతి ...

 ఈర్ష్యా ద్వేషాల కుంపట్లు 

తేది: 08-05-2024
శీర్షిక : దారి తప్పుతున్న నీతి ... 

యుగ ప్రభావమో...  
జగత్  ప్రమోదమో... 
వేగం పెరిగిన వెర్రితలలో ... 
కాలుష్యాల కమామీషులో .... 

అవిభాజ్యాల అంతర్దానంతో 
పారిశ్రామికీకరణ పరుగుపందెంలో 
పట్టణీకరణలతో ... పట్ట పగ్గాలు 
లేని విచ్చలవిడితనాల విచ్చుకత్తులో ... 

స్వార్థం సర్పాలు విషనాగులై 
మిన్నాగులై బుసలు కొడుతుంటే 
బంధాలు అనుబంధాలు 
అపహాస్యాలై అల్లాడుతున్నాయి .... 

మేకతోలు కప్పుకున్న 
ప్రజాస్వామ్యపు పడగల నీడలలో 
అంతరాల దొంతరలు అమాంతం 
పెరిగిపోయి... అగ్నికి ఆజ్యమైనాయి ... 

శ్రీరంగనీతులు వల్లించేవారెక్కువ 
పాటించేవారు తక్కువై... ఈర్ష్యా 
ద్వేషాల కుంపట్లను ఆశ్రయిస్తూ 
ఆనందాలు వెతుక్కుంటున్నారు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment