కాలం చెప్పిన కథలు
తేది : 03-04-2024
శీర్షిక : కాలమెపుడు సమవర్తినే…
కదలని కాలంలా భ్రమలు కల్పించే
కదిలే కాలం కబుర్లను కథలు
కథలుగా
గుణశీలతలన్ని కాలమాళిగలో గుప్తంగా
పొందుపరుచుకుంటుంది ...
యుగాలైనా జగాన తేజమై నిలిచిన
రామాయణం… ధర్మం కోసం దాయాదులనైనా
గెలవాలని బోధించిన భగవద్గీతైనా….
తరాలెన్నింటినో తనలో ఇముడ్చుకున్న సుగుణశీలి…
నీతి కథలు జాతి కథలే కాదు కాశీ మజిలీ
కథలైనా…కడుపులో పెట్టుకుని కాచుకుంటుంది..
చెప్పుడు మాటలనైనా చేతబట్టి రాయించారో..
అదే వాస్తవమనే అపోహలో బతుకుతుంది…
మంచి చెడుల మతలబులలో
త్రాసు
ఎప్పుడూ మంచివైపు మొగ్గు చూపుతూ
ఆలస్యమైనా మనతప్పును తాను
సరిచేస్తుంది...
మంచితనానికి మచ్చుతునకలా మసులుకుంటుంది…
మంచివైనా చెడువైనా చేయ తగినవి
చేయకూడనివి ఏంటో తెలియచేస్తూ
ముందు తరాలకు
మురిపాల గురువై
బోధనలతో మార్గదర్శనం చేస్తుంది …
స్వార్థ మూతి పిందెలు కొందరు
బాధ్యతల నిర్వహణలో కొంతమందిని
బలిపశువులను చేసి బంతాటలు
ఆడినా..
కాలం మార్చిన కథలో
జవాబు చెప్పి
చెంపలు వాయించుకోవాల్సిందే..
నగునూరి రాజన్న
No comments:
Post a Comment