Saturday, July 13, 2024

కొత్త ఊపిరి తేది: 06-03-24 శీర్షిక: చెట్టంత కొడుకు చేతికొచ్చాడు ...

 కొత్త ఊపిరి

తేది: 06-03-24
శీర్షిక: చెట్టంత కొడుకు చేతికొచ్చాడు ... 

ఫోన్ మోతతో జల్లుమన్న ప్రాణాలు 
పరిగెత్తి ప్రత్యక్షంగా చూసుకుంటే
పై ప్రాణాలు పైననే లేచి పోయినాయి 
కాలు చేయి ఆడలేదు నోరు పెగల్లేదు ... 

108లో వెల్తుంటే నవనాడులు కదిలాయి. 
నోరెండిపోయి ఏడ్వడానికి కూడా ఓపికలేదు.. 
శరీరం మొద్దుబారి యాంత్రికమైపోయినది… 
స్టెచర్ పైన చూస్తుంటే  గుండె తరుక్కపోతున్నది… 

చెట్టంత కొడుకు ఆరుఫీట్ల ఆకారం… 
గుట్టలాగ పడి ఉన్నాడు… ఏమి జరిగిందో 
ఎలా జరిగిందో తెలువది… తెలుసుకోవాలనే
ఆలోచన కూడా లేదు… ఏం చేస్తే బాగుంటది… 

ఒకటే ఆరాటం…డాక్టర్లకు మొక్కినం..
ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్ళారు… 
మనసులోనే దేవుళ్ళకు మొక్కుకున్నం… 
గంటగంటకు ఎదురు చూపులే మా వంతు.. 

ఒళ్ళంతా వైర్లే…మానిటరింగ్ కోసం… 
గొంతులోకి పైపే… మూత్రానికి పైపే…. 
ఐ వి లు నడుస్తున్నయి… యంఆర్ ఐ 
రిపోర్టులకు ఎదురు చూస్తున్నాం… 

అప్పుడే వచ్చిన న్యూరో ఫిజీషియన్ 
సరిగ్గా సమయానికి తెచ్చారు...
భయపడాల్సింది లేదంటూనే ... 
కొంత ..ఎంత ... .తెలియనంత 
సమయం పడుతుందని సెలవిచ్చారు.... 

మనం చేయగలిగినంత చేద్దాం... 
దేవుడే మనకు దారి చూపాలంటూ 
శాస్త్రీయత ముగింపులో ఆధ్యాత్మికత 
ఆలంబన చేసుకోమంటూ వెళ్లారు ... 

మూడు నెలలకు గాని లేచి 
నడవలేదు ... నోట మాట రాలేదు... 
కొత్తగా ఊపిరి పోసుకున్నంత 
పనైంది ... చెట్టంత కొడుకు చేతికొచ్చాడని 
మిత్రుని ఆనందం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment