కవన రవళి
అంశం : అమ్మ
నానీలు. 05-03-24
1.జీవితాంతం
చెప్పుతూ పోయినా
ఒడువని ముచ్చటే…
అమ్మ కదా!
2. అమ్మకో రోజని
కేటాయించడం…
అపరిపక్వతల
అకతాయితనం…
3.సాధికారతల
ఆశలు చూపిస్తూ…
ఇరు సంధ్యల
జపమే నాయకులు…
4. అమ్మను
పొగడ్తలతో ముంచి
అగడ్తలలోకి
నెట్టేస్తున్నం…
5.అమ్మ మన
చిరునామా…
అది గుర్తిస్తే
నిజమైన మనుషులం.
నగునూరి రాజన్న.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment