కళ్లద్దాలు
తేది: 05-05-2024
శీర్షిక : ప్రగతిపథంలో తనవంతు…
సర్వాంగాణాం నయనం ప్రధానం
అనుభవాల సారం.. పాటించడమే
సర్వోత్కృష్టం.. లేనేలేదు ప్రత్యామ్నాయం..
వీడాల్సిందే అలసత్వం.. కాదంటే
కర్మ
సిద్ధాంతం.. మిగులు కదా నిత్యం పోరాటం...
ఒకప్పుడు దినకరుని వెలుతురులో
దివ్యంగా పనులు చేసుకుంటే..
ఇపుడంతా కరెంటు వెలుగులో కవాతు
చేయడమే అందరికి అవసరమయ్యింది ...
అనారోగ్యాల పలకరింపులతోనో
విటమిన్ల లోపాలతోనో బాలలకు..
పెద్దరికం మీదపడ్డ వృద్దులకు
వద్దన్నా వచ్చే దూర చూపు అద్దాలు...
దివ్యాంగులు కొందరైతే.. అపాయల
పలకరింపులు మరికొందరికి.. అనారోగ్య
పరిమళాలు ఇంకొందరికి.. ఏతావాతా
ఎదురుపడి పోరాడాల్సిందే... కళ్ళాద్దలతో
కర్మ కొంత కనికరిస్తే కరుణామృతమే ...
వయసు బరువు మోపితే
కొందరికి
నలభయ్యిల్లో చత్వారం..
దగ్గరిచూపు
మందగించి
చదువు రాతలకు దూరం
చేస్తే..
చకచకా చక్కదిద్దుకోవచ్చు
రెడీమేడ్
కళ్ళద్దాలతో ...
గబగబా చదివేయొచ్చు
రాసేయొచ్చు సుందరంగా ...
కల్మషాలకు కత్తిగా... కలుషితాలకు
డాలుగా..ఎండవేడికి
శీతలములై
ప్రచండమైన అగ్ని రవ్వలకు అడ్డుగా
ఎనలేని సేవలే నూతనావిష్కరణల
దీటైన చలువ కళ్ళజోళ్ళు మానవాళికి ...
ఏది ఏమైనా ప్రగతి పథంలో
పడుతున్న అడుగులకు
తనవంతు
సహకారంతో కళ్లద్దాలు కూడ కదం
కలుపుతున్నాయి విశ్వ విరించిలో…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment