కుడి ఎడమల స్వార్థం ... స్వార్థం
తేది : 05-03-2024
శీర్షిక : కుసుమ పరాగమే
కలి ప్రభావమో ... కాల ప్రభావమో
కాలనాగులా బుసలుకొట్టి విజృంభించి
కాలకూట విషంలా విస్తరిస్తూ
కబళించాలని పొంచి ఉన్నది.
అన్యోన్యంగా పెరిగిన తోబుట్టువులు
ఆశకు మాడి మసి అవుతున్నారు.
ప్రాణసమంగా పెరిగిన ప్రాణమిత్రులు
పైసల కోసం అసువులు పాస్తున్నారు ...
ప్రకృతిలో పుట్టి పెరిగి జీవరాశిలో
మిన్నంటూ గొప్పల గప్పాలు...
పరుల మేలు కోరే పాఠం మాత్రం
ఓ పట్టాన బుర్రకు ఎక్కించుకొని
ప్రబుద్ధత.....
అసలే కోతి ఆపై కళ్ళు తాగినట్టు
పాశ్చాత్యం పడగ నీడలో
ఆదిదేవతలంటూ కొలిచే
అమ్మానాన్నలైనా...అర్ధభాగమనే
ఆలితోనైనా సరే...అంతా స్వార్థమే...
పంపకాల పట్టికలో పాలకులు
కూడా కండువాలు మార్చుతూ
కంపరమెత్తించే పొత్తులతో
కత్తులు దూసుకుంటుంటే ...
జనసామాన్యులకు ముందు నుయ్యి
వెనక గోయ్యి ఏం ఖర్మ ....
కుడి ఎడమల కూడా కుసుమ
పరాగమే స్వార్ధపు నీడలు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment