కవన రవళి
మహిళా దినోత్సవ గజల్
04-03-2024
6/6/6/6
అవనిలోన అపురూపం
నిలిచినావు ఓ మహిళా
అనునిత్యం పోరాటమె
గెలిచినావు ఓ మహిళా ....
కానుపుతో మరోజన్మ
అయినా వెరవదు అమ్మా
ఆత్మీయత చిరునామా
చేసినావు ఓ మహిళా
వున్నామా నరకాలను
నీవు జయించేశానని
పురుడు పోసుకోగానే
మురిసినావు ఓ మహిళా
తల్లిగాను చెల్లిగాను
ఆలిగాను అవతరించి
అనుదినము సవ్యసాచిగ
నడచినావు ఓ మహిళా
అనురాగపు మందిరమే
రాజసాల సుందరమే
దైవానికి ప్రతీకగా
వెలసినావు ఓ మహిళా
నగునూరి రాజన్న
No comments:
Post a Comment