Thursday, July 25, 2024

హాస్య గేయాలు తేది 04-05-2024 శీర్షిక : సనాతనం స్వగతం .

 హాస్య గేయాలు 

తేది 04-05-2024
శీర్షిక : సనాతనం స్వగతం ... 

అందరికి ఆమోదమే 
ఆనందన  సనాతనం ... 

మానవాళి జీవనానికి 
పూర్వికుల పుణ్యచరిత 
మేలైన విధానములు 
తీర్చిదిద్దే అనుభవాల...  

సంఘంలో బ్రతుకుతీరు 
సమున్నతమై నిలబెట్టగ  ... 
మర్మముతో మార్గదర్శమై  
మంత్రములో నిబిడీకృతం .... 

అందరికి ఆమోదమే 
ఆనందన  సనాతనం
 
సనాతనం గొప్పదని 
సర్రాసుగా ఒప్పుకుంటరు... 
పాటించే విషయంలో 
అలసత్వం చూపుతరు 

తిప్పలేమి లేకుండానే 
గొప్పలకు పోకుండనే  
ఉన్నంతలో సర్దుకుని 
ఉన్నతంగా బ్రతుకొచ్చు .... 

అందరికి ఆమోదమే 
ఆనందన  సనాతనం 

చిన్నా పెద్ద గుర్తిస్తేనే 
చిగురించును లేలేతగా ... 
పోటీపడి పాటించితే 
లూటీపడు నీ జేబుకే .... 

పడమటింటి పేరుతో 
ఎటమటము పనులొద్దు .... 
తటపటాయింపు లేకుండా 
నిటారుగా నిలవండి .... 

అందరికి ఆమోదమే 
ఆనందన  సనాతనం 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment