నవ్వుల దినోత్సవం
తేది : 03-05-2024
శీర్షిక : విరిసే మందారం
విరిసే మందారంలా విచ్చుకుంది
మురిసే ఎద లోతులా పరుచుకుంది
నవ్వే ఒక భోగం ... నవ్వలేకపోతే
ఒక రోగం అని అనుభవజ్ఞుల మాట ....
అంతరంగపు వింత సౌరభానికి
బాహ్యరంగపు బహిర్గతం దరహాసం ...
రకాలెన్ని ఉన్న దృశ్యం రక్తి కడుతుంది
ఆరోగ్యాలకు అనుసరణీయం .....
పాలబుగ్గల పాపాయిల బోసినవ్వులు
చక్కిలిగింతల చిక్కని నవ్వులు
మురిపాల ముసిముసినవ్వులు ...
తిరగబడే విరగబడ్డ నవ్వులు
చక చక శబ్దపు పకపక నవ్వులు
వెక్కిరించే వెకిలి నవ్వులు ....
సుందరమైన మంద్ర హాసములు
అరువు తెచ్చిపెట్టుకున్న అప్పుల నవ్వులు ...
సంతోషానందలకు సంకేతం
విషయసంగ్రహణల వినయం ...
ముఖ కండరాల మురిపాల వ్యాయాయం
రోగనిరోధక శక్తికి మంచినీటి చలిమ ...
నవ్వును చిన్నబుచ్చే సామెతలెన్నున్నా ...
సన్నుతించు కదా ..మంచి నవ్వులన్నీ
మనిషిని బ్రతికించు మరో పది కాలాలు
మరువ ధమానాల గుభాళింపులై ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment