Wednesday, July 3, 2024

నమ్మకపు దారుల్లో తేది : 04-03-2024 శీర్షిక: నమ్మకాలకే అమ్మలాంటి అసలైన నమ్మకం

 నమ్మకపు దారుల్లో 

తేది : 04-03-2024
శీర్షిక: నమ్మకాలకే అమ్మలాంటి 
అసలైన నమ్మకం

ఇటుక ఇటుక పేర్చినట్టు 
ఇంపైన పొదరిల్లు కట్టినట్టు 
అజంతా సిమెంటంత గట్టిగా 
బంధమై నిలవాలే గాని .... 

ఎన్ని గాలి వానలొచ్చినా 
ఎంత తుఫానులొచ్చినా 
హరికేన్ సునామీలొచ్చినా 
గరకంత నిటారుగా నిలవమా ఏంది... ? 

వంతుకు దాసరి కాలాడిచ్చినట్టు 
పొంతన లేని ఎన్నికల పత్రాలెన్ని 
విడుదల చేస్తే మాత్రం ఏం లాభం.... 
మసకబారిన బతుకు దారులే సాక్షం .... 

దుర్భిణి వేసుకున్న దృష్టికందని  
చెప్పిందే చేసే దమ్మున్న నాయకుడు 
అక్కడక్కడా మృగరాజులా మాత్రం కన్పిస్తే 
తుంపిర్ల బలం చూపించే నాయకులు 
చాలా మందే ఉన్నారు .... 

నీడలాంటి ఒక హచ్ కుక్క ...ఒక మహీంద్రాలా ... 
ఒక టాటాలా .... కోట్లు పోసినా దొరకని 
అక్కడక్కడా మాత్రమే తారసపడే 
నమ్మకాలకే అమ్మలాంటి అసలైన నమ్మకం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment