వర్కింగ్ ఉమెన్
తేది 02-03-24
శీర్షిక: సవ్యసాచి కన్నా ...
బద్దకిస్తే బతుకుదెరువు లేక
ఉద్దెరపొద్దులు లేని జీవితం....
ఓపికున్నా లేకున్నా ఉరకాల్సిందే
ఆటోలోనో బస్సులోనో చేరాల్సిందే....
పొయ్యిలో పిల్లి కదలాలన్నా
కడుపులో చల్ల పడాలన్నా
ఇంటిల్లిపాది త్రేన్చాలన్నా
అమ్మ చేయి ఆడాల్సిందే ....
భర్త అత్తమామల పిల్లలను
చూసుకుని బరబరా పరుగెత్తి
బస్సెక్కి గమ్యం చేరాల్సిందే
బతుకు పోరాటానికి తెర తీయాల్సిందే....
గృహిణులంతా ఉదయాతపూర్వమే
లేచినా లేవకపోయినా వర్కింగ్
ఉమెన్ మాత్రం సవ్యసాచికన్నా
ఆ పైన పరుగులెత్తడమే నిత్యకృత్యం ....
పంతులమ్మలైతే మాత్రం మరో
మాతృ అవతారం ఎత్తి ఓపికకు
కేరాఫ్ గా మారిపోవాల్సిందే ...
పాఠాలు నేర్చుకునే నిత్యవిద్యార్థినిగా
మారిపోవాల్సిందే.... ఇంటిపని, వంటపని,
కార్యాలయం పని , పరీక్ష పేపర్లు , మార్కులు
ప్రాజెక్టు పనులు ..... ఒక్కటేమిటి ....
సవాలక్ష....
ఇదే కాకుండా మృగాలా మధ్య
జింకపిల్లలా తప్పించుకుంటూ
తనను తాను కాపుడుకునే జాన్సీలా
అవసరమైన వేళలో పులిలా మారి
పునీతమై పోవాల్సిందే.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment