Thursday, July 25, 2024

సంభాషణలు తేది : 03-05-2024 శీర్షిక : సంజీవని ....

 సంభాషణలు 

తేది : 03-05-2024
శీర్షిక : సంజీవని .... 

విశ్వ ప్రాణకోటిలో విశిష్ట లక్షణం 
మనిషికి మాత్రమే సాధ్యం ... 
అంతరంగపు ఆలోచనలతో మేధోమధన 
సాధ్యాలతో మాటలు భాషలుగా రూపొంది 
భావ సంపదల బదిలీలతో .... 
వర్దిల్లె బహుళ ప్రచారమై .... 

మనిషి మనిషికి మార్పులతో ... 
సమయానుకూలమై సంధించు మాట ... 
స్పందనలను బట్టి సముదాయించుకుంటూ ... 
వివేక విచక్షణల విజ్ఞాన విషయాలు ... 

అప్పుడప్పుడు అవలోకనం కూడా 
స్వంతమైన సంభాషణలే ... 
అంతరంగ ఆవిష్కరణకోసం 
అనుపానుల కనిపెట్టుకొనుటకై ... 

కొత్త వారితో సంభాషణలు 
కొన్ని కొన్ని  పరిమితమితులకు 
లోబడి... విషయ సంగ్రహణకు 
వింత ఆయుధంగా పనిచేయును .... 

సంభాషణాలెప్పుడు సంగ్రహముగా 
సందిగ్దత లేకుండా ...సవినయమైతే 
సాగితే .. సమున్నతమే ... వ్యక్తి శక్తిని 
అంచనా వేయుటకు వరమయ్యే ఆయుధం .... 

చింతలు నిండిన చీకటిలో ... 
అనారోగ్యాల అతలాకుతలంలో .... 
ఒంటరి సమయపు కుంపటిలో .... 
సంభాషణ సంజీవనిలా పనిచేయు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment