బోధన
తేది : 02-04-2024
శీర్షిక : పిండి కొద్దీ రొట్టె
అమ్మే అందరికి ప్రథమ గురువు
బోధనలో మొదటి ఘట్టం
అమ్మనుండే సంక్రమిస్తుంది ....
మాట ... నడక ...నడవడిక ...
ఎన్నెన్నో ... లెక్కలేనన్ని ...
ప్రకృతి పరిస్థితులే సహజ
బోధనల సంధాతలు ...తదుపరి
అనాదినుండి మానవాళి
అనుసరిస్తున్న పరంపరనే ...
నేర్చుకున్న మెళకువలను
నేర్పుగా ఓర్పుతో పది మందికి
ప్రణాళికగా అంచెలంచెలుగా
అవగాహనా పరచడమే ....
వివిధములైన విద్యలకు
వేరువేరు గురువులు
వైవిధ్య రీతుల తెలియచేయడమే
బోధనా విధానాలు ....
కోటి విద్యలు కూటి కొరకే
అన్నట్టు... సవాలక్ష విద్యలకు
సూక్ష్మ బోధనలు ... బృంద
బోధనలు ... ప్రత్యేక బోధనలు ...
పిండికొద్దీ రొట్టె సామెతగా
మనమేం కావాలనుకుంటే
ఆ విధమైన మూసలో నేర్చుకునే
విధానమే ప్రత్యేక బోధన ,,,,
నగునూరి రాజన్న
No comments:
Post a Comment