Thursday, July 25, 2024

మండే ఎండలు - తేది ; 02-05-2024 శీర్షిక : దరువే ...

 మండే ఎండలు - 

తేది ; 02-05-2024 
శీర్షిక : దరువే ... 

శిశిరం తరువుల తలలు దులిపాక 
వసంతం వచ్చి చివుల్లేసి పలకరిస్తుంది ... 
ముడుచుకున్న మేనులకు కాస్త 
ఉపశమనమై ఊపందుకుంటుంది ఊష్ణంగా  ... 

దరువేసి చిందేసిన చెరువులన్నీ 
అండగంటి ... తాగునీరుకు సాగునీరుకు 
సుక్కలను చూపిస్తుంది ... అయినా 
మనిషి మేలుకోవడంలో అలసత్వమే .... 

ఉన్న కాసిన్ని మంచినీటిని ఉచిత 
కలుషిత కాసారారాలుగా చేసి జీవరాశికి 
భావసౌందర్యంలేని బ్రతుకు రుచి 
చూపిస్తున్న  మూర్ఖశిఖామణి మనిషి .... 

ఇంతింతై వటుడింతై లాగ బాలభానుడు 
కాస్త యవ్వన దశకు చేరినట్టుగా 
జోరు పెంచి బారైనా కిరణాలతో 
బాదేస్తూ ... రోజు రోజుకు వేడిని 
పెంచుతున్నాడు.... 

చేవలేని చెరుకు రసాలు 
ఫలించని పళ్ళ రసాలు 
రసాయన మంత్రాల కొబ్బరినీళ్లు 
కల్తీలు నిండిన మజ్జిగనీళ్లు .... ఏమాత్రం 
ఆర్తి తీర్చని అనుగ్రహ దేవతలు ...  

నాడైనా నేడైనా భానుడు భానుడే 
ఎండలు ... ఎండలే ... గొడుగు 
లాంటి పచ్చదనం దినదినంగా 
తగ్గుతుంటే .... వేడి పెరిగిన స్పృహ ... 

ఇకనైనా మనిషి మేలుకోని 
కలుషితాలు కట్టడిచేస్తూ ... 
పచ్చదనాలను పెంచి పోషించకపోతే  
ఇక్కట్లే రాబోవు తరాలకు .. 
జీవరాశికి ...మండే ఎండలతో 
గుండె దడదడల దరువే జనులకు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment