Thursday, July 25, 2024

చదువులమ్మ చెట్టు నీడలో తేది : 23-04-24 శీర్షిక : బుట్ట తేనెల విజ్ఞానము

 చదువులమ్మ చెట్టు నీడలో 

తేది : 23-04-24
శీర్షిక : బుట్ట తేనెల విజ్ఞానము 

బుట్టతేనెలాంటి విజ్ఞానం 
జుర్రకోవాలంటే …రంగురంగుల
సీతాకోక చిలుకలై చదవులమ్మ 
చెట్టుమీద వాలిపోవాల్సిందే…. 

 గణ గణ గంటల మోతల ప్రారంభం
 బిల బిల బాల్యం తచ్చాడుతుంటే 
 గం గం గణపతియేనమః అంటూ 
 జుంజుం మారుతమే విజ్ఞానం ... 

పచ్చని మరకతపు ఛాయలలో నాడు 
గురుకులాలే విజ్ఞాన మంటపాలు..
బాదరబందీల ఊరుకు దూరంగా 
బహులెస్సల బోధనలే హుషారుగా... 

అంతరాల దొంతరలు లేకుండా 
మల్లెలు మందారాలు చామంతులే… 
చరిత తెలిసి భవిత తీర్చి దిద్దుకోవడం
బంగారు లక్ష్యంగా గమ్యం చేరుకోవడమే ...

అంతరిక్షంలో సంచరించగలిగే 
వ్యోమగాములైనా..అదఃపాతాళంలో 
ఆవిర్భవించే ఇంధనాల చందమామ 
అభియంతైనా చెట్టునీడలో వాలిన పిట్టలే .... 
 
దేశ ప్రగతికి సమిదలయ్యే 
 దేహ దర్భలన్నీ... చదువులమ్మ 
 చెట్టు నీడలోనే చిగురించిన ముత్యపు 
పలుకుల చిలకలే… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment