Saturday, July 13, 2024

పర్యావరణ గేయం తేది : 15-04-2023 శీర్షిక : వేప చెట్టు

 పర్యావరణ గేయం 

తేది : 15-04-2023
శీర్షిక : వేప చెట్టు 
కవిత సంఖ్య : సహస్రాధికం .... 

అలసత్వం వీడరా 
ఆలోచన చేయరా .... //2// 

రసాయనాలు  రంగరించి 
క్రిములను నువు వేటాడగ …. 
ధాన్యరాశి పెరిగిందని 
దరహాసం వెలిగినావు… 

అంతలోనే  పిచ్చుకలు  
అంతరించి  గల్లంతాయే .... 
తీరికగా తేరుకుంటే 
దిద్దలేని తప్పిదాలు  .... 

అలసత్వం వీడరా 
ఆలోచన చేయరా .... 

సౌకర్యాల సంబరముగ
పాలిథీన్లు ముట్టుకుంటే ... 
అవనిమాత దుఃఖించే
అంతట తానావరించగా…

కాలుష్యపు కోరలతో 
విషతుల్యం నీరంతా .... 
కిమ్మనకా   తాగలేవు 
కడుపునిండ కమ్మగా .... 

అలసత్వం వీడరా 
ఆలోచన చేయరా .... 

తరువమ్మ మెరుపులతో 
మరకతమై శోభించును .... 
తగదు నీకు తగదురా 
దునుమాడ వనములను .... 

గిరులన్నీ కోటలుగా 
మేఘాలను పలకరిస్తేనే… 
వానమ్మను చిలకరించి 
పాడిపంటలందించు .... 

అలసత్వం వీడరా 
ఆలోచన చేయరా .... 

విలాసాల క్రీనీడల 
విలవిలలే వాయువులు... 
ప్రాణాలు అరచేతిలో
పదిలమయే  శ్వాసలకు ....   

ప్రాణికోటికి ఊపిరయిన
వేపలన్నీ ఎండుతున్నయి …
వేగిరపడు మానవా 
తరుణమేదో చూడరా …

అలసత్వం వీడరా 
ఆలోచన చేయరా .... //2// 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment