Saturday, July 13, 2024

జాగృతి గేయాలు. తేది: 14-05-2022 శీర్షిక : ఊపిరి పాట

 జాగృతి గేయాలు. 

తేది: 14-05-2022
శీర్షిక : ఊపిరి పాట
కవిత సంఖ్య : 901

జీవరాశికంతటికి 
మానవాళి మిన్నని 
విజ్ఞానం వివేకం
విచక్షణల భంఢాగారం … 

ప్రకృతి పాఠాలను 
విశ్లేషించు క్షుణ్ణంగా .... 
పరితపించి మేలుచేయి 
పరిశ్రమను నమ్ముకుని ... 

ఇతరులేమి చేశారని 
ఇల వరుసలు చేయకు .... 
కలిగిన దానిలోనే 
కరములు విదిలించుము  .... 

అవని మీదికొచ్చాక 
అహం నువ్వు పెంచుకోకు ..... 
ఆస్తులివ్వలేదని 
అమ్మానాన్ననొదులుకోకు... 

కనుముక్కు తీరే నీకు  
కడదాకా ఆభరణాలు .... 
కబోదివి కానందుకు 
కర్మను నేస్తంగా మలుచుకో  ..... 

కాలుచేయి బాగుందని 
కరమోడ్పులు దైవానికి ....
కనిపించని దైవానికి
కర్మతోనే సమాధానం....  

మురిసిపోవు ప్రతిదినం 
మూగ జీవులు  సైతం...   
ప్రకృతి పాఠం అదేనని 
పరికించి పరిచయించు .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment