సూక్తి
శీర్షిక : సూక్తి సుధలు
తేది : 29-11-2023తక్కువ నిడివిలో ఎక్కువ
భావం
నింపుకుని పలుకుటలో
మక్కువ
చూపించే విధంగా రత్న సమానమైన
పద సంపదల సమాహారమే ...
వల్లె వేసుకుంటే వాటమైన జీవిత
సూత్రాలే…మార్గదర్శకం చేస్తూ మనల్ని
మంచి వైపు నడిపించే మంత్రమై చిరకాలం
చిందిస్తూ తరాలను తట్టి పలకరిస్తుంది …
రక రకాల విషయాలపై
రంజుగా సాగే సూక్తి సుధలు
తెలుగుభాషలో తెగువ చూపిన
సందర్భాలు కోకొల్లలు ... ఎప్పుడైనా…
*వేటకెళ్తే గాని యాట దక్కదని*
నేటి పాలకుల దమన నీతుల
రాజకీయం.. అంచనాల పట్టికలో
వంచనల కేటాయింపులు ...
ఎన్నికల పుణ్యమాని *ఎలుక తోకలు
పట్టుకుని ఉతికి ఆరేసినట్టు*…
మానిఫెస్టోలలో మహాత్యముందని
ఊదరగొడుతూ *మెట్లులేని నిచ్చెనలెక్కిస్తున్నారు*
జనాలను…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment