Saturday, July 13, 2024

వినోద గేయాలు తేది: 26-05-2023 శీర్షిక : తెరలవాణి.

 వినోద గేయాలు 

తేది: 26-05-2023
శీర్షిక : తెరలవాణి. 
కవిత సంఖ్య : సహస్రాధికం 

తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....
తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  

తెల్లారిపోకుండనే 
దురద పెట్టి గోక్కుంటాను
నువు తెలివి కొచ్చే విధంగా 
నిదుర లేపుతుంటాను 
(అలారం ) 

గణ గణ మంటూ 
గుడి గంటలోలె మోగిస్తా .... 
గడియకొక్కసారి నిన్ను 
బిరబిరా పరుగులెత్తిస్తాను ....  
( కాల్ రావడం) 

తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  
తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  

చేతులలో  పట్టేంత 
చిన్న పెట్టెనే నేను
చేవ గలిగే పనులన్నీ 
చేసేస్తుంటాను .... 

చేతికి ఆరోవేలులా
అంటిపెట్టుకుంటాను 
హచ్ కుక్కలాగా నిన్నెప్పడు
వెంబడిస్తు ఉంటాను … 

తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  
తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  

ఊరుమ్మడి బతుకుల 
ఊసులన్ని చెబుతాను… 
రహస్యాల గుట్టువిప్పి 
రాజరికం చేస్తాను…. 

శంఖమూది చెవిలోన
జోరీగను అవుతాను… 
గుసగుసల మసాలాలు 
కుమ్మరించి పోతాను…. 

తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  
తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  
 
యూట్యూబుల సంగతులు
ఊసుపోని కబుర్లు.. 
వాట్సాప్ ల షేరింగులు 
వాటమైన ముచ్చట్లు… 

ఆప్ లన్ని నింపేసి
డౌన్ లోడ్ చేస్తాను… 
డాఫర్ గాల్ల గాలాలకు 
కాసులను పోగొడుతాను…

తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  
తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  

నగదులతో పని లేదు 
చకచకన చెల్లింపులే… 
వచ్చినా పోయినా 
లెక్కంతా చూసుకుంటా… 

వైఫై తోడైతే నైఫ్ నే 
నేనింకా … 
పనులన్నీ చేసిపెట్టి 
అలసత్వం నీకిస్తా…. 

తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  
తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  

చార్జింగులు చేయిస్తే
పానానికి పానమోలె
నమ్మకానికి అమ్మలా 
బంటునైపోతాను… 

తప్పుగా నొక్కావో 
తిప్పలే నీకింకా…. 
పొరపాటున పడేసావో 
గ్రహపాటే ఇకనీకు… 

తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  
తెరలవాణి  నోయమ్మా 
తెరలవాణిని....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment