Wednesday, June 12, 2024

చీమల‌ పుట్ట* 💐 శీర్షిక : వింతలు నిండిన భవంతి

 *చీమల‌ పుట్ట* 💐

శీర్షిక : 

ఇంజనీరింగులోన ఇగురశాలి
 నాణ్యతలలోన నడక నేర్పినది  
 విస్తీర్ణతలోన కొదువలేనిది 
 వింతలు నిండిన భవంతి 
 విందుభోజనాల నిలయం ...

మట్టి పులలనే మానుగా మిశ్రయించి
మహలునే నిర్మించు మహిమ చూడు…
శుచి శుభ్రతల శోభించునెపుడు
అనారోగ్యాలనందిపుచ్చుకునె సౌకర్యంతోడ… 

 రాణివాసము రమ్యమగునట
 కార్మికలోకం కష్టించునచట …
 కనికరములేక వెంటనే కుట్టునట 
 కదిలించి ఎవరైన వేలుపెట్టిన ...

విజ్ఞానవంతుణ్ణని విర్రవీగే మనిషి సైతం..
వింతగ నేర్వవచ్చు ఎంతో కొంత..
పిపీలికమని తీసి పారేయయక 
చూచిన వాటి పనితనమున మతి చలించి ...

అప్పుడప్పుడవి దాతృత్వము 
ప్రదర్శించి ధన్యులగును …
గృహముల దాతలై గూడునిచ్చును 
గుంభనమున పాములకు ...

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment