శ్రీపదాలు
1. గురువుస్థానం ఎప్పుడూ ఉన్నతమే.
దేశ భవితను తీర్చిదిద్దంగా…
జాతి కీర్తిని ఇనుమడించంగా…
03-07-23
శ్రీపదాలు

2. తల్లిదండ్రుల తదుపరి గురువే.
పిల్లలను సన్మార్గములో నడిపించగా…
చక్కదిద్ది సద్భుద్ధులను నేర్పంగా…
03-07-23
శ్రీపదాలు

3. పిల్లలకు గురువే సర్వం.
ఆటపాట నేర్పించి ఆరితేరదీయంగా…
అనుపానులు బోధించి
రత్నమోలెచేయంగా…
03-07-23
సవరణతో…..
శ్రీపదాలు

1.వెలిగించని దీపం సూర్యుడు.
అఖండజ్యోతిలా అనవరతము ప్రకాశిస్తూ…
చరాచరజీవకోటికి నిత్యం
ప్రాణాధారసంజీవనియై…
04-07-23
శ్రీపదాలు

2. నిత్యం వానమబ్బులు దోబూచులాడుతున్నవి.
ఉరుములు మెరుపుల మురిపిస్తూ…
హాలికులను చకోరపక్షులను చేస్తూ…
04-07-23
శ్రీపదాలు

1. అంకురానికి జంకులేని సంబరమే.
అంబరం వానవీణను మీటగానే…
అవనిమాత ఒడిలో నిశ్చింతగా….
06-07-23
శ్రీపదాలు

2. వానవీణ మ్రోగింది చివరకు.
నిన్నమొన్న అనుమానాలతో అడుగులేసి…
ధైర్యవచనాలతో నేడు దాపునిలుస్తూ…
06-07-23
శ్రీపదాలు

1.జీవరాశి మోములో వెలుగులే.
వానవీణ వరసపెట్టి మోగగానే…
ఎండపిట్ట తుర్రుమని పక్కకెల్లగానే…
10-07-23









*నేటి ఉత్తమ శ్రీపదకర్తలు*
*తేదీ 10.07.2023*









*ముత్తుశ్రీ గారు*









*శ్రీపదాలు*
1. దరహాసమూ పరిహాసము చేసినట్లుంది..
కనులకదలిక సైతం రెచ్చగొట్టినట్లుంటుంది..
శత్రువు సంధిపేరుతో సమీపించినప్పుడు.
10/07/23
*ముత్తుశ్రీ*









*నగునూరి రాజన్న గారు*









*శ్రీపదాలు*
1.జీవరాశి మోములో వెలుగులే.
వానవీణ వరసపెట్టి మోగగానే…
ఎండపిట్ట తుర్రుమని పక్కకెల్లగానే…
10-07-23
*నగునూరి రాజన్న*









*దార. స్నేహలత గారు*








*శ్రీపదాలు*
1.స్నేహపు పరిమళానికింతటి పరమార్థమేమిటో...!
వేవర్ణాల పరిచయాలలో ఉన్నతమైనదిగా...!!
పలకరింపులవిరులతో ఆశయానికి జీవంపోస్తూ..!!!
10.07.2023
*దార. స్నేహలత*









*కొమురోజు మాధవి గారు*









*శ్రీపదాలు*
1. అనుశ్రీ మానసపుత్రికగా శ్రీపదాలు ...
పుట్టించినమ్మకే ఆనందంగా పుట్టినరోజుచేస్తూ...
సమూహంలో సంబరాలు అంబరాన్నంటాయి....!
10.07.2023
*కొమురోజు మాధవి*









శ్రీపదాలు 

1. తొలకరితో పులకరించిన
తరువమ్మ.
ఒడిసిపట్టింది ఒయ్యారంగా
ముత్యపుబిందువులను…
పచ్చదనం పదిలంగా విస్తరింపజేస్తానంటూ….
17-07-23
శ్రీపదాలు

2. వానవీణలు మోగించడం ఖాయం.
ఆలస్యం అవుతుందేమో కొంత…
అనావృష్టి ఆవరించనీయని అక్షయంగా…
17-07-23
శ్రీపదాలు

3. వానమ్మ పలకరింపు ఆనందమే.
పొంచిన అనారోగ్యాలు పసిగట్టకుంటే…
ఇంటిల్లిపాది జాగ్రత్తలు తీసుకుంటే…
17-07-23
శ్రీపదాలు

శ్రీపదమే సిరిశిఖరమై వెలుగుతుంది.
మూడులోని మురిపాలను మూటగడుతూ…
తొమ్మిదిలోని తోరపుబంధాలను
తడుముతూ….
26-07-23
శ్రీపదాలు
2. శ్రీపదాలతోటలో సిరిమల్లెల జల్లులే.
పరిమళాలు పుడమంతా పరివ్యాప్తిచేస్తూ…
వేనోళ్ళ పొగడ్తలతో భాసురమౌతూ….
26-07-23
శ్రీపదాలు

3. సాహిత్యపరంగా బహుముఖప్రజ్ఞకు శ్రీపదాలు.
అలతిపదాలలో అనంతార్థములను పొదువుకుని…
భాషాబలాన్ని గుంభనంగా ప్రదర్శింపజేస్తూ….
26-07-2023
No comments:
Post a Comment