కవన రవళి. 25-01-26
హైకూలు.
1. కాకెంగిలికి
కరిగి పోనిదేగా
స్నేహమంటేనో…
2. ఒకరి గమ్యం
మరొకరి గమనం
తోడు చేయడం..
3.కష్టాల్లో తోడు
సుఖాలలో నీడగా
స్నేహ సూత్రము…
4. పరోక్షమైనా
పడగనీడలను
పడనీయడు.
5. మననంతోనే
మనసు పులకించు
స్నేహము కదా…
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment