Wednesday, June 19, 2024

చిరు ధాన్యాలు తేది 04-12-23 శీర్షిక : సీమ టపాకాయలు

 చిరు ధాన్యాలు

తేది 04-12-23
శీర్షిక : సీమ టపాకాయలు 

ప్రకృతి కానుకగా పరిచయమై 
పరమాన్నమై కడుపులు నింపాయి… 
పడువాటుకు పండిన పంటలు 
ఎడబాటుకు గురైనాయి అన్నంతో…. 

పాత ఒక రోత అన్నోళ్ళే… ప్రముఖమని 
ప్రస్తావిస్తూ ..పట్టం కడుతున్నారీనాడు… 
సశాస్త్రీయమని చెబుతూ…బలాబలాల 
బేరీజులతో ప్రధానమైనది ప్రజాజీవితంలో… 

చిరుధాన్యాలే చిచ్చరపిడుగులని
ఆరోగ్య ప్రదాతలని… అనుభవ పాఠాలను 
అందరు వల్లెవేస్తూ వైవిధ్యమైన వంటలతో 
నోరూరిస్తూ…చిన్నతరహా పరిశ్రమలకు చిరునామైంది…

సీమటపాకాయల్లా పేలిపోతూ 
చిర్రు బుర్రులు మాయం చేసి 
చిరునవ్వులు పూయించాలని 
విజ్ఞుల కోరిన చిరు కానుకలే 
వింతగా పట్టుకున్న రహస్యం 
చిట్టి పొట్టి ధాన్యాల సామర్థ్యం .... 

సజ్జలు జొన్నలు సంకటికోసం 
రాగులు రోగ నిరోదకతలకు 
అరికెలు కొర్రలు యాంటీఆక్సిడెంట్స్ గా 
సామలు అధిక జీర్ణ శక్తిల నిస్తూ .... 

తీపి చేదు వగరు పులుపు ఉప్పు
కారాల  షడ్రుచులను కూడా పంచుతూ…
వాత పిత్త పైత్యాది అనారోగ్యాలకు 
అడ్డు కట్టలు వేసి  రోగనిరోధకతలకు 
భాండాగారలౌతున్నాయి ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment