సాగర ఘోష
తేది 27-12-23
శీర్షిక : పెద్దన్న పాత్ర
జీవరాశి మనుగడించాలన్నా
వృక్షరాశి ఇనుమడించాలన్నా
సెలయేళ్ళుగానో నదులుగానో
నడయాడుతూ నాగరికతలను
నాటుకుంటూ వెలుతూ సంద్రములయ్యే
జల సిరులే జంగమదేవరలు ...
వింత వింత జలచరాలకు నివాసయోగ్యమై
రత్నరాసులకు నిలయ భండాగారమై
అప్పుడప్పుడు వస్త్రకాయితముతో
వడబోసుకుంటుంది తనకు తానుగా
ఆధారభూతులకు ఆహారమవడానికి ...
భూగర్భములో నిక్షిప్తమైన వేడికో ...
వాతావరణములోని కాలగమనాలకో
పర్యావరణం పదిలపరచడానికో
తడికి
ఆధారభూతమై ఆవృతమై సంచరించు
ఆకాశము అవని మధ్యలో సశాస్త్రీయముగా ....
మానవ తప్పిదాల మడత పేచీలు
కుప్పలు కుప్పలై పడుతున్న తిప్పల
ప్లాస్టిక్కులు పనికిరాని చెత్తలతో చిత్తై
కలుషితాలతో కుములిపోతున్నది…
ఓర్చుకున్నంత సేపు పెద్దన్నే
కన్నెర్ర చేసిందా కథ కంచికే…
ప్రళయంతో విలయ తాండవం చేసి
మరో మైలు రాయికి కనపడని గీత
గీసుకుని చరిత్రలో చిరాయువవుతుంది…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment