Wednesday, June 19, 2024

ఆనంద తీరం తేది: 07-12-23 శీర్షిక : అనుభవ సౌందర్యం.

 ఆనంద తీరం

తేది: 07-12-23
శీర్షిక : అనుభవ సౌందర్యం. 

ప్రేరణ పొందిన ప్రతీ విషయం
పెన్నిధిలా మనసున పెనవేసుకుని 
ఆశల మదిలో అంకురముగ ఏర్పడి
ఆశయాలుగా స్థిరమై సిద్దించినప్పుడు...

పరంధాముని పవిత్రమైన వాకిలికి 
తగిలించిన మాలలలోని పూవులలా… 
పుణ్యంచేసుకున్న కొన్నింటిలో
స్వామి పాదాలు చేరిన పరిమళ కుసుమంలా…

అనంత సంద్రపు సంపదలో 
 అలలపైన పయనించి తీరం చేరిన శంఖం
వ్యప్రయాసలతో తీర్థ యాత్ర చేరుకొని
తిరునిలయంలో పూజింపబడినప్పుడు… 

సత్సంకల్పాల సంచుల్లో 
నింపుకున్న ఆలోచనల భాండాగారం … 
అకుంఠిత దీక్షల ఆత్మగా… 
ప్రణాళికల అమలులలో పట్టుదలల పెట్టుబడియై
ఫలించిన ప్రతి ప్రయత్నం జీవితమున  
మైలురాయైనప్పుడు ... 

నిజంగానే మేను పులకరించి 
మది పలకరించి..వీణలు మీటి రాగం పలికి … 
ఒళ్ళంతా తుళ్ళింతలై మేఘాలలో తేలిపోతూ
పుష్పకవిమానయానమవదా అనుభవ సౌందర్యం… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment